బోడుప్పల్:ఆర్ఐ కోట వెంకటేశ్వర్లు గ్రేట్ వర్కర్:మేనేజర్ మంజులత

బోడుప్పల్:ఆర్ఐ కోట వెంకటేశ్వర్లు
గ్రేట్ వర్కర్:మేనేజర్ మంజులత

బోడుప్పల్, మే 19 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ నగర పాలక సంస్థలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న కోట వెంకటేశ్వర్లు ను ఆర్. డి. ఎమ్. ఎ హైదరాబాద్ రీజియన్ వారు ఘట్కేసర్ మున్సిపాలిటీకి డిప్యూటీషన్ పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారి చేసారు. దీనికి అనుగుణముగా కోట వెంకటేశ్వర్లుని కమీషనర్ వాణి రెడ్డి విధుల నుండి రిలీవ్ చేయడం జరిగింది. అదే విధముగా కోట వెంకటేశ్వర్లుని నగర పాలక సంస్థ ఉద్యోగులు,సిబ్బంది ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియ చేశారు.

ఈ సందర్బంగా కోట వెంకటేశ్వర్లు ఏ భాద్యతను ఇచ్చినా సమర్ధవంతముగా నిర్వహించారని మేనేజర్ మంజులత కొనియాడారు. ఈ కార్యక్రమములో డిఈఈ లు శ్రీలత, శారద, అకౌంటెంట్ లక్ష్మి, ఎస్ ఐ జాన్ పాల్, జూనియర్ అసిస్టెంట్స్ వనిత, సంగీత, నగర పాలక సంస్థ వర్క్ ఇన్స్పెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, బిల్ కలెక్టర్స్, వార్డ్ ఆఫీసర్స్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆర్. పీ లు, చైన్మెన్ లు ఇతర సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *