ఫ్లాష్..ఫ్లాష్.. ఢిల్లీలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆత్మహత్యాయత్నం

ఫ్లాష్..ఫ్లాష్.. ఢిల్లీలో ఎమ్మెల్యే
దుర్గం చిన్నయ్య బాధితురాలి
ఆత్మహత్యాయత్నం

  • ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించారని
  • హాస్పిటల్ కు తరలించిన తెలంగాణ భవన్ సిబ్బంది

ఢిల్లీ, జూన్ 2 (విశ్వం న్యూస్) : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె విషం తాగారు. దీంతో వెంటనే తెలంగాణ భవన్ సిబ్బంది స్పందించి శేజల్‌ను ఆసుపత్రికి తరలించారు.

దుర్గం చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని బోడపాటి శేజల్ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యేను తక్షణం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయాలని శేజల్ డిమాండ్ చేస్తున్నారు.

సూసైడ్ లెటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *