సేవే పరమావధిగా సాగుతున్నజమ్మికుంట వాసవి క్లబ్ సేవలు
సేవే పరమావధిగా సాగుతున్న
జమ్మికుంట వాసవి క్లబ్ సేవలు

జమ్మికుంట, జూన్ 2 (విశ్వం న్యూస్) : వాసవి క్లబ్ జమ్మికుంట ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు ఉచిత రాగుల జావా పౌడర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు రావి కంటి నీలకంఠం మాట్లాడుతూ సమాజంలో మున్సిపల్ కార్మికుల సేవవెలకట్టలేనిదని వారు ఆరోగ్యంగా ఉంటేనే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయి వారికి ఆరోగ్య అవగాహన కల్పించడం కొరకు వారు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ. రాగి జావా పౌడర్ పంపిణీ చేయడం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ బి శ్రీనివాస్, శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ వి శ్రీకాంత్, వాసవి క్లబ్ రీజియన్ చైర్పర్సన్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, జిల్లా క్యాబినెట్ అదనపు కార్యదర్శి గందె ప్రవీణ్ కుమార్, వ్యాంసాని రమేష్, జోన్ చైర్ పర్సన్ గంప సురేందర్, వాసవి క్లబ్ జమ్మికుంట అధ్యక్షుడు రావికంటి నీలకంఠం, కార్యదర్శి అయితు రమేష్, కోశాధికారి గుడివాడి వెంకట సతీష్, కార్యవర్గ బృందం గుండా తిరుపతయ్య, అయితు శ్రీనివాస్, సుద్దాల భాస్కర్ లింగం, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
