Vishwam Newsతెలంగాణహైదరాబాద్

ప్రజల సొమ్ముతో దశాబ్ది ఉత్సవాల..?

ప్రజల సొమ్ముతో
దశాబ్ది ఉత్సవాలా..?

  • దశాబ్ది ఉత్సవాల కోసం ప్రజల సొమ్ము వాడకంపై విమర్శలు

పీర్జాదిగూడ, జూన్ 2 (విశ్వం న్యూస్) : ప్రజల సొమ్ము రాళ్ల పాళ్ళు అన్నట్లుగా ఉన్నాయి పీర్జాది గూడ కార్పొరేషన్ పాలకవర్గం పరిస్థితి.. నియంతృత్వ పాలనను ప్రసన్నం చేసుకోడానికి, ప్రజల సొమ్మును దుర్వినియోగ పర్చుకోడానికి ఏకగ్రీవ ఆమోదం పీర్జాదిగూడ కార్పొరేషన్ పాలకమండలి తీరు శోచనీయం..
పదేండ్ల పాలనా ఏ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిందని, 21 రోజుల సంబురాలతో సమస్యలేమి లేని కార్పొరేషన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసినా.. నవ్వులపాలు అవుతున్న పాలన విభాగం.

ఆవిర్భావ వేడుకల పేరుతో ఆర్బాటం చెయ్యడానికి రూ. 30లక్షల రూపాయల ఖర్చు కోసం టాక్స్ ల రూపంగా వసూలైన డబ్బులను బీఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ భజన కోసం ఉపయోగించడానికి ఆమోదం తెలుపుకోవడం సిగ్గుచేటు, బాధాకరం. ఇంత డబ్బును ఎందుకు వృధా చేస్తున్నారో మేయర్ పాలనా మండలి సమాధానం చెప్పాలి.

ఇప్పటికే అనేక అంశాలతో అభివృద్ధి ముసుగుతో యతెచ్చగా సీలింగ్ భూములు,పార్కు స్థలాలు అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్లు అన్ని ధ్వంసం అవుతుంటే డ్రయినేజ్ వ్యవస్థ పాడవుతుంటే ఎస్ ఎన్ డి.పి నాలా పనులు ఆగిపోయి ఉంటే దాదాపు అన్ని డివిజన్లలో పార్క్ స్థలాలు కబ్జాలు అవుతుంటే అభివృద్ధి నోచక అచేతనంగా ఉంటె సామజిక మాధ్యమాల్లో ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ రాయించుకుంటే అదే అభివృద్ధి అని చెప్తూ మోసం చేస్తే ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరు. ఇప్పటికైనా ఆయా రూ. 30లక్షల రూపాయలు రోడ్ల మరమ్మతులకు రోడ్లపై ఉన్న కరెంటు స్తంభాలను తొలిగించుటకు కార్పొరేషన్ ప్రజల సంక్షేమ కోసం, లైబ్రరీ నిర్మాణం కోసం ఉపయోగించాల్సిందిగా డిమాండ్ చేశారు.

కార్పొరేషన్ కార్యాలయానికి అనుకుని ఉన్న అమరవీరుల స్తూపానికి మరమ్మతులు చెయ్యకుండా, కనీసం అమరవీరులకు నివాళులు అర్పించకుండ, వివక్ష చూపడం ముమ్మాటికీ తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవహేళన చెయ్యడమే అని, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని దుయ్యబట్టారు. ప్రజల సంక్షేమ పరంగా ఉండాల్సిన బడ్జెట్ కేవలం తెరాస భజన కోసమే ఉపయోగించడం వ్యాపార వ్యక్తిగత కోణమే తప్ప ఉద్యమ ఆంకాంక్షలు ఏమీలేవు. అడ్డదారిలో అనతికాలంలోనే వందల కోట్లు కొల్లగొట్టడం తప్ప పాలకులు చేసింది ఎం లేదని, ఇదే విధంగా ప్రజ ధనాన్ని దుర్వినియోగ పరిస్తే కార్పొరేషన్ ప్రజలు తిరుగుబాటు చేస్తారని సామజిక ఉద్యమ నేత, మేడ్చల్ నియోజకవర్గం నాయకులు పొంగ ప్రణయ్ మాదిగ అన్నారు.

  • దశాబ్ది ఉత్సవాలకు 30 లక్షల కేటాయించడంపై సర్వత్ర విమర్శలు
  • మేడ్చల్ జిల్లా బీఎస్పీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ డిమాండ్
    • పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు రూ. 30 లక్షలు కేటాయించడం పట్ల సర్వత్ర విమర్శలు రేకెత్తిస్తున్నాయి. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు కేటాయించిన 30 లక్షల రూపాయలపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా బీఎస్పి పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ మాట్లాడుతూ సొమ్మోకొరీది. సోకొకరిది అన్నట్లు పీర్జాదిగూడ కార్పొరేషన్ పాలకవర్గం పని తీరు ఉందని ఎద్దేవాచేశారు. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ స్పందించి ఈ 30 లక్షల రూపాయలను పీర్జాదిగూడ నిరుపేద ప్రజల అభివృద్ధికి కేటాయించాలని కోరారు. పీర్జాదిగూడ పరిధిలో ఎన్నో సమస్యలు ఉన్నాయని,ఈ 30 లక్షల రూపాయలతో ప్రజలకు మంచి అభివృద్ధి చేయవచ్చని సూచించారు. ఒకవేళ 30 లక్షలు ఖర్చుపెట్టినట్లయితే జిల్లా కలెక్టర్ తో పాటు చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *