హైదరాబాద్

ఉత్తమ అధికారినిగా పీర్జాదిగూడ మేనేజర్ జ్యోతి రెడ్డి

మేడ్చల్:ఉత్తమ అధికారినిగా
పీర్జాదిగూడ మేనేజర్ జ్యోతి రెడ్డి

పీర్జాదిగూడ, జూన్ 2 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయ సముదాయంలో (కలెక్టరెట్) లో రాష్ట్ర మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వివిధ శాఖలలో ఉత్తమ పనితీరును ప్రదర్శించిన అధికారులను ఘనంగా సన్మానించారు.

ఇందులో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ ఉత్తమ పనితీరుకుగాను మేనేజర్ జ్యోతి రెడ్డికి రాష్ట్ర మంత్రివర్యులు చామకూర మాల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *