బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు కమిటీల నియామకం

జమ్మికుంట:బీఆర్ఎస్ పార్టీ
6వ వార్డు కమిటీల నియామకం

జమ్మికుంట, జూన్ 7 (విశ్వం న్యూస్ ) : జమ్మికుంట మున్సిపల్ పరిధి లోని 6వ వార్డు లో బీఆర్ఎస్ పార్టీ వివిధ కమిటీల నియామకం జరిగింది. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు అధ్వర్యంలో జరిగిన ఈ కమిటీల నియామకం క్రమంగా 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడుగా మార్గ స్వరాజ్, ఉపాధ్యక్షుడుగా తుమ్మేటి మహేందర్ రెడ్డి, యూత్ అధ్యక్షులుగా ఎం.డి ఇమ్రాన్, మహిళా అధ్యక్షురాలుగా కొడాలి లక్ష్మి, ఎస్.సి సెల్ అధ్యక్షుడుగా కుమారస్వామి, సోషల్ మీడియా ప్రచార కర్త గా పాత రాజేష్, మైనారిటీ అధ్యక్షుడుగా ఎం.డి సిరాజ్ లను నియమించారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజేశ్వర్ రావు, కౌన్సిలర్ నరేశ్, కొత్తగా ఎన్నికైన వార్డు కమిటీల సభ్యులు, వార్డు ప్రజలు, బీఆర్ఎస్ నాయకుడు కోటి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *