ఓటు హక్కు ను వినియోగించుకున్న
ప్రధాన అభ్యర్థులు..
నాయకులు.. ప్రముఖులు..
కరీంనగర్, మే 13 ( న్యూస్): లోక సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాన అభ్యర్థులు.. నాయకులు.. ప్రముఖులు.
- కరీంనగర్ లోని జ్యోతినగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించున్నారు.
- కరీంనగర్ లోని క్రిస్టియన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించు న్నారు.
- కరీంనగర్ లోని ముకరంపురలో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తన కుటుంబసభ్యుల తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- మానకొండూర్ మండలం పచ్చునూర్ లో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనరాయణ తన కుటుంబ సభ్యు లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- అలుగునూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
- మానకొండూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న
మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్. - మానకొండూర్ లో మాజీ సుడా చైర్మన్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణ రావు తన కుటుంబ సభ్యు లతో కలిసి ఓటు హక్కును వినియోగించు కున్నారు.
17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోలింగ్..
- తెలంగాణ లో భారీగా పెరిగిన పోలింగ్ శాతం…
అదిలాబాద్ 69.81
పెద్దపల్లి 63.86
కరీంనగర్ 67.67
నిజామాబాద్ 67.96
జహీరాబాద్ 71.91
మెదక్ 71.33
మల్కాజిగిరి 46.27
సికింద్రాబాద్ 42.48
హైదరాబాద్ 39.17
చేవెళ్ల 53.15
మహబూబ్ నగర్ 68.40
నాగర్ కర్నూల్ 66.53
నల్గొండ 70.36
భువనగిరి 72.34
వరంగల్ 64.08
మహబూబాబాద్ 68.60
ఖమ్మం 70.76.