ఆర్థికశిల్పి మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి
ఆర్థికశిల్పి కి ఘన నివాళి

- “డా. గూడూరి చెన్నారెడ్డి, IPC తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్

హైదరాబాద్, డిసెంబర్ 27 (విశ్వం న్యూస్) : మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం అత్యంత బాధాకరం అని “డా. గూడూరి చెన్నారెడ్డి, IPC తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అన్నారు. “ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, అవిశ్రాంత యోధుడు, మహోన్నత నాయకుడు భారత దేశ ఆర్థికశిల్పి మన సింగ్ జి. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్న.
రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా, అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, మన దేశానికి సింగ్ జి అందించిన సేవలు అమూల్యం. మన్మోహన్ గారి సారథ్యంలో మన దేశం అత్యధిక వృద్ధి రేటు సాధించి, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇండియన్ ఎకానమీ సూపర్ పవర్ గా గుర్తించబడింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో సింగ్ జీ సంస్కరణలు కీలకం. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకుండా గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిది.
డాక్టర్ సింగ్ హక్కుల ఆధారిత విప్లవం భారత రాజకీయాల్లో సరికొత్త శకాన్ని సృష్టించింది. సమాచార హక్కు చట్టం మన దేశ పౌరుల హక్కులను కాపాడితే, ఉపాధి హామీ పథకం నిరుపేదల జీవితాలకు మార్గదర్శి అయ్యింది. ఆ మహనీయుడి సంస్కరణలు, సాధించిన విజయాలు మన దేశ ప్రతి పౌరుడికి ఆదర్శం..” అని అన్నారు.
