పవన్ భూములపై రంగనాథ్ వ్యాఖ్యలు

హైదరాబాద్, జూలై 21: జన్వాడలోని కోడి చెరువు భూముల వివాదంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు చెందిన భూములు కోడి చెరువు పరిధిలో ఉన్న మాట వాస్తవమేనని, అయితే వాటిని ఆయన 2014లో చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌కు చెందిన సుమారు 6 నుంచి 7 ఎకరాల భూమి చెరువు ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉండగా, మరో 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ వెలుపల ఉన్నాయని పేర్కొన్నారు. చెరువు ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని, అదే ఆయన చేసిన తప్పుగా భావించవచ్చని రంగనాథ్ వ్యాఖ్యానించారు.
అయితే, పవన్ కళ్యాణ్‌పై వస్తున్న చెరువు ఆక్రమణ ఆరోపణల్లో వాస్తవాలు లేవని, ఈ అంశంపై హైడ్రా పరిశీలనలో ఎలాంటి అక్రమ ఆక్రమణ నిర్ధారణ కాలేదని స్పష్టం చేసినట్లు సమాచారం.