అమరావతి, ఆగస్టు 3 (విశ్వం న్యూస్) :
👉ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం
👉చేనేత రంగాన్ని భుజాన ఎత్తుకుని పూర్వ వైభవానికి కృషి చేయడం చేనేత కారుల సమస్యలు తీర్చడానికి నడుం బిగించడం. చేనేత వస్త్రాలను ధరించి ప్రచారం కల్పించడం
👉పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన మూల లంకలోని 207 ఎకరాల రైతుల భూముల్లో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరం
👉అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడి వారికి మనోదైర్యాన్ని ఇవ్వడం.
👉మిర్చి రైతులకు క్వింటాకు 11 వేల రూపాయలు కల్పించేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వచ్చి విజయం సాధించడం.
👉అధికార ప్రజా ప్రతినిధులు దుశ్చర్య కి భాదితులు గా ఉన్న ప్రభుత్వ అధికారులకు అండగా నిలవడం
ఉదా : ఎమ్మార్వో వనజాక్షి గారు.
👉గ్రూప్2 ప్రిలిమ్స్ కు మెయిన్స్ పరీక్షకు సంబంధించి విద్యార్థుల కొరకు పరీక్ష గడువును పెంచేలా చేయడం.
👉వ్యవసాయ విద్యార్థులకు సంబంధించి జి వో నెంబర్ 64 రద్దు అయ్యేలా శాయశక్తులా ప్రయత్నించి విజయం సాధించడం.
👉విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న వాటికి అడ్డుకట్ట వేసేలా చేయడం.
👉పాతిమా కాలేజి విద్యార్థులకు అండగా నిలబడి వారి సమస్యను తీర్చడం.జీవో విడుదల చేయించి పూర్తి న్యాయం చేయడం.
👉కృష్ణ నది ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి భవిషత్తు లో అలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం నుంచి యుద్ధ ప్రాతిపధికిన నివారణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని మేల్కొల్పడం.
👉పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలు పరిశీలించి అక్కడ జరిగిన అవినీతి మీద ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం.
👉DCI ప్రేవేటి కరణ చేయకుండా ఉండేలా చిత్తశుద్ధితో పని చేసి విజయం సాధించడం.
👉హోం గార్డ్ లు కలిసి తమ గోడు చెప్పు కుని రాష్ట్రంలో ఆదుకునే దేవుడు మీరే అనగానే సమస్య పైన పోరాటం జీతాలు పెంపు
👉కాంట్రాక్ట్ విద్యుత్తు ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలిపి సమస్యలు పట్ల పోరాటం చేయడం.
👉జన్మభూమి కమిటీలు అవినీతి లంచాలు కోసం మాట్లాడ గానే జన్మభూమి కమిటీలు రద్దు .
👉ఇసుక మాఫియా కోసం లోకేష్ అవినీతి కోసం పవన్ పంజా విప్పగానే ఇసుకను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం.
👉అరకు లోయలో ఇంత వరకూ ఏ రాజకీయ నాయకుడు వెళ్లని ప్రాంతాలకు వెళ్లి విద్యా వైద్య విధానాలు మీద గిరిజనులు సమస్యలు తెలుసుకుని అక్కడ త్రాగు నీటిని నమూనాలు సేకరించి వ్యాధి నివారణ పరిస్థితులు మీద నిపుణులు చేత అధ్యయనం చేయించడం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం.
👉మూడు శతాబ్దలుగా కిడ్నీ వ్యాధి మహమ్మారి సోకి 20 వేలు మంది చనిపోయిన పట్టని సమస్యను వెలుగులోకి తీసుకుని వచ్చి వైద్య సదుపాయాలు కోసం నిరాహారదీక్ష చేపట్టి మరిన్ని నిధులు విడుదల చేయించడం.
👉ఆక్వా డంపింగ్ యాడ్ తుందురు ఆక్వా ఫుడ్ సమస్య పైన అధ్యయనం చెయ్యడం అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు ని నిలదీయడం .
👉పడవ ప్రమాదాల్లో మరణించిన చిన్నారి కుటుంబాల కి అన్ని విధాలా అదుకోమని జన సైనికులకి దిశానిర్దేశం చేసి ఆర్ధిక సహాయం చేయించడం.
👉నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్లోరైడ్ సమస్యలపై పోరాటం చేయడం.
👉గుంటూరు డయేరియా వ్యాధి పై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలలో డయేరియా కు ఆధునిక వైద్యం అందుబాటులోకి తేవడానికి కృషి చేయడం.
👉దివాస్ సమస్య పై పోరాటం చేయడం
👉CPS స్కీం రద్దుకు కట్టుబడి ఉద్యోగులకు మద్దతు ఇవ్వడం
👉ప్రీతి సుగాలి కేసులో సీబీఐ విచారణ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం పై పోరాటం చేసి విజయం సాధించడం.
👉బొబ్బిలి జ్యుట్ మిల్లు ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం.
👉పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాసిన ఏకైక పార్టీ జనసేన మాత్రమే.
👉కొవ్వాడ అణువిద్యుత్ సమస్యపై పోరాటం చేయడం.
👉వంశధార, నాగావళి నదుల ముంపు గ్రామాలకు వసతులు కల్పించేలా పోరాటం చేసి విజయం సాధించడం.
👉అరకులో గిరిజనుల సమస్యలపై పోరాటం చేయడం.
👉గంగవరం పోర్టు నిర్వాసితులకు న్యాయం కోసం పోరాటం చేసి విజయం సాధించడం.
👉హిందూ ఆలయాల దాడులపై రాష్ట్రం మొత్తం గళంవినిపించి హిందూ విగ్రహాలపై మలం పూయడం, రధాలు తగలబెట్టడం వంటి దాడులపై ప్రభుత్వంపై ఒత్తిడి చేసి దాడులు జరగకుండా హిందూ ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టించి బందోబస్తు ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని రక్షించడం
👉విశాఖపట్నం రైల్వేజోన్ సమస్యపై కేంద్రంపై పోరాటం చేసిన ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే
👉సోంపేట బీల భూముల సమస్య
👉రైతులధాన్యం (రబీ, ఖరీఫ్) సొమ్మును ప్రభుత్వం ఇవ్వకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిరసనలు తెలిపి రైతుల ఖాతాల్లో జమాయ్యేలా, రైతుల ఆత్మహత్యలు జరగకుండా రైతుల పాలిట ఆత్మబందువు అయ్యింది జనసేనపార్టీ.
👉ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి వాడుకుంటున్న ఆనాడు టీడీపీ, ప్రస్తుతం వైసీపీ లపై పోరాటం చేసిన ఏకైక పార్టీ జనసేన మాత్రమే.
👉కాపు విదేశి విద్యా కానుకను నిలిపియడాన్ని నిరసించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ.
👉ఇంటర్ విద్యార్థులకు కరోనా కష్టకాలంలో పరీక్షలు వాయిదా వేయాలని ఇంటర్ బోర్డుపై, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించడం.
👉రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న (విజయనగరం షుగర్ మిల్లు చాగల్లు షుగర్ మిల్లు, శృంగవరపు కోట జిందాల్ ఫ్యాక్టరీ సమస్య, ఇలా) మూత పడిన మిల్లు కార్మికుల సమస్యలపై పోరాటం చేయడం
👉పెట్టుబడి సొమ్ము కూడా రాకుండా నష్టాల్లో సేద్యం చేస్తున్న కాజు రైతులు, టమాట రైతులు, అరటి రైతులు, పత్తి రైతుల సమస్యలను పోరాటం చేయడం.
👉 తోటపల్లి రిజర్వాయర్ బాధితుల అండగా పోరాటం చేయడం.
👉పాడేరు గిరిజనుల సమస్యపై పోరాటం చేయడం.
👉ప్రజల ప్రాణాలను హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్లు పై పోరాటం చేయడం
👉జంగారెడ్డిగూడెం కల్తీ సారా తాగి చనిపోయిన బాధితులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి విజయం సాధించడం, జనసేన నుంచి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి నష్టపరిహారం అందించడం.
👉108,104 ఉద్యోగులపై సమస్యలపై పోరాటం చేసి లోకో పైలెట్ కి 30 వేలు, ఎమర్జెన్సీ టెక్నీషియన్ కి (EMT) కి 30 వేలు జీతం ఇచ్చేలా కృషి చేసి విజయం సాధించడం.
👉విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా ఢిల్లీ అధిష్టానం ని కలిసి వాస్తవికతను తెలియచేసి ఏకైక పార్టీ జనసేన మాత్రమే.
👉యురేనియం మైనింగ్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి నల్లమల అడవులను కాపాడాలని ట్విట్టర్ వేదికగా పోరాటం చేసి విజయం సాధించడం.
👉విభజనతో అన్యాయం జరిగిన ఆంద్రప్రదేశ్ కి న్యాయం కోసం కేంద్రంతో పోరాటం ఏకైక రాష్ట్రానికి చెందిన పార్టీగా గుర్తించవచ్చు
👉2018 లో పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలను కలుపుకొని ఆంద్రప్రదేశ్ కి మేలు చేయాలి అని విభజన చట్టంలో హామీలు అమలు కోసం కేంద్రానికి నివేదిక ఇవ్వడం కోసం 2018 లో జనసేన పార్టీ సీపీఐ,సీపీఎం,లోక్ సత్తా, కాంగ్రెస్ తో కలిసి అనుభవజ్ఞులతో కలిసి ఫైండ్ ఫ్యాక్ట్స్ కమిటీ వేయడం జరిగింది ఇదే కమిటీకి టీడీపీ, వైసీపీ కి ఆహ్వానాలు పంపడం జరిగినా కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టాయి.
👉రాజధాని అమరావతి రైతులకు అండగా నిలిచి వారి పోరాటానికి మద్దతు తెలిపి వారికి భరోసా కల్పించి కేంద్రానికి రైతుల పరిస్థితిపై నివేదికను తయారు చేసిన ఏకైక పార్టీ జనసేన మాత్రమే.
👉ఉండవల్లి ,జయప్రకాష్ నారాయణ, సీపీఐ, సీపీఎం మరియూ ఇతర అనుభవం కల్గిన నేతలు ఆంధ్రకు విభజన హామీలు ప్రకారం 72 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది అని పేర్కొంటూ… పోలవరం పూర్తి అయ్యే బాధ్యత కేంద్రం స్వీకరించి త్వరితగతిన నిర్మాణం చేపట్టాలి అని,కడపజిల్లా లో ఉక్కు కర్మాగారం నిర్మించాలి అని, విశాఖపట్నం లో రైల్వే జోన్ ఇవ్వాలి అని రాజధాని కి నిధులు ఇవ్వాలి అని నివేదిక కేంద్రానికి పంపడం జరిగింది.
👉జనసేన నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ సవాలుగా స్వీకరించి అమిత్ షా 9 పేజీలు లేక రాస్తూ 4 ఏళ్లుగా కేంద్రం అమలు చేసిన పథకాలు ఇచ్చిన నిధులు ఆంధ్ర అభివృద్ధి కి ఖర్చు చేయకుండా అవినీతి చేశారు అని పేర్కొంటూ ఇచ్చిన నిధులకు DSR (Detailed Status Report) ఇమ్మని కోరడం జరిగింది. జనసేన తప్ప రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇలాంటి సాహసం చేయలేదు.
👉ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నష్ట పరిహారం అందక పోవడంతో తానే కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇచ్చేలా చేయడం.
👉జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేయించి మరణించిన కార్యకర్తల కుటుంబాలకు భరోసాగా 5 లక్షల రూపాయలను అందించిన మొదటి పార్టీ జనసేన పార్టీ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కి సాధ్యం కాని అతిపెద్ద విజయం.
👉కరోనలాంటి అతిపెద్ద విపత్తులో దేశం మొత్తం గర్వంగా చెప్పుకునేలా ఏ రాజకీయ పార్టీలకు సాధ్యం కాని విధంగా జనసేన పార్టీ కరోనా కుటుంబాలకు చేసిన సేవలు, సహాయ సహకారాలు, ఎన్నో కుటుంబాలకు ప్రాణ దానం అందించిన విధానం అతిపెద్ద విజయంగా చెప్పొచ్చు దేశంలో ఏపార్టీ కార్యకర్తలు ఇలాంటి సేవలు అందించడం సాధ్యం కాదు జాతీయమీడియా ప్రసంసలు అతిపెద్ద విజయం.