కరీంనగర్

క‌న్నుల పండువ‌గా శ్రీ సీతారాముల క‌ళ్యాణం

క‌న్నుల పండువ‌గా
శ్రీ సీతారాముల క‌ళ్యాణం

పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
వైద్యుల శ్రీదేవి-అంజన్ కుమార్ దంపతులు
కరీంనగర్, మార్చి 30 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పట్టణంలోని ఆదర్శనగర్ శివాలయం శ్రీ రాజరాజేశ్వర శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ కరీంనగర్, వైద్యుల శ్రీదేవి-అంజన్ కుమార్ దంపతులు. పూజారి విశ్వవతి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.

అనంతరం తోట సత్యం దంపతులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మెతుకు కనకయ్య, కార్యదర్శులు భూమిరెడ్డి, ఓం మల్లయ్య, గందె లక్ష్మీనారాయణ, ఇట్టినేని శ్రీనివాస్, కోటి, రమేష్, జైపాల్ రెడ్డి, రమణ,రామ్మూర్తి, మనోహర్, రామ్ బ్రహ్మం, అశోక్ రెడ్డి, రామోజీ, సత్యనారాయణ, వంశీ కొమురయ్య తదితర కమిటీ దంపతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *