Vishwam Newsకరీంనగర్

జేపీసీ వేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం

జేపీసీ వేసేంతవరకు
కాంగ్రెస్ పార్టీ పోరాటం

  • అదానీని కాపాడాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తుంది
  • బిజెపి ప్రభుత్వ పాలనలో న్యాయవ్యవస్థ, పార్లమెంటు వ్యవస్థ అణిచివేయబడుతున్నాయి
  • ప్రధాని, అదానీ మధ్య ఆర్థిక వ్యాపార సంబంధాలను బయటపెట్టినందుకే రాహుల్ గాంధీ గారిపై వేటు వేసిన బిజెపి అదాని వ్యవహారంపై జేపీసీ వేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది
  • ఎ.సంపత్ కుమార్
    మాజీ శాసనసభ్యులు, ఎఐసిసి సెక్రటరీ

కరీంనగర్, మార్చి 31 (విశ్వం న్యూస్) : నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు నుండి బహిష్కరించడానికి ఖండిస్తూ టిపిసిసి పిలుపుమేరకు నేడు కరీంనగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో ఎ.సంపత్ కుమార్ మాజీ శాసనసభ్యులు, ఎఐసిసి సెక్రటరీ మాట్లాడుతూ దాదాపు తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో అటు న్యాయవ్యవస్థ, ఇటు పార్లమెంటు వ్యవస్థ ఈ రెండు వ్యవస్థలను వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ విధానాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని సుమనత్వాన్ని స్వేచ్ఛను రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అణిచివేసైనా సరే అదానీని కాపాడాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ బిజెపి సర్వ ప్రయత్నాలు చేస్తుంది.ఇందుకోసం భారతదేశ విశిష్టతను ప్రాముఖ్యతను రాజ్యాంగ వ్యవస్థను, న్యాయవ్యవస్థను తుంగలో తొక్కుతున్నారు.

అదానీ వ్యవహారాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారి ప్రసంగాన్ని మరియు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి నరేంద్ర మోడీకి అదానీకి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆర్థిక, వ్యాపార వాణిజ్య సంబంధాలను ఆధారాలతో సహా ఫోటో క్లిప్పింగ్లు వీడియో క్లిప్పింగ్ లతో సహా బయటపెట్టిన రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని పార్లమెంటు రికార్డుల్లో లేకుండా చేశారు. అనంతరం సూరత్ కోర్టులో స్టే విధించబడి ఉన్న కేసును 24 గంటల్లో రీ ఓపెన్ చేసి రాహుల్ గాంధీ గారి శిక్షపడే విధంగా చేసినారని సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు.

పార్లమెంటు సాక్షిగా ప్రధాని అదాని ఆర్థిక వ్యవహారాల గురించి రాహుల్ గాంధీ గారు సంధిస్తున్న ప్రశ్నలకు భయపడి 2019 ఎన్నికల ప్రచారంలో ఈ దేశాన్ని అప్పుల్లో నుంచి పారిపోయిన లలిత్ మోడీ హీరో మోడీ ఇలా దొంగలందరూ మోడీ అనే పేర్లు పెట్టుకున్నారని కర్ణాటకలో అన్న వ్యాఖ్యలకు సంబంధమే లేకుండా కోర్టు పరిధి దాటి తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని సూరత్ కోర్టు లో ఒక బిజెపి ఎమ్మెల్యే ద్వారా కోర్టు కేసు వేయించి పరువు నష్టం పేరుతో రాహుల్ గాంధీ గారికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం, తీర్పుపై పైకోర్టులో అప్పీల్ కు అవకాశం ఇస్తూ 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ న్యాయవ్యవస్థ విలువలను కాలరాస్తూ పార్లమెంటరీ వ్యవస్థ భాగస్వామ్యమై కేవలం 24 గంటలు గడిచేలోపే రాహుల్ గాంధీ గారిని లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ స్పీకర్ గెజిట్ జారీ చేయడం జరిగింది, 48 గంటలు దాటకముందే అధికారిక నివాసం ఖాళీ చేయాలని పార్లమెంటు కార్యాలయం నుండి ఉత్తర్వులు ఇవ్వడం వెనక ఏ విధంగా న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించినారో స్పష్టమవుతుంది.

రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యునిగా రాహుల్ గాంధీ గారిని ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని అన్యాయాన్ని ప్రశ్నించినందుకు జైలుకు పంపి వారిని ప్రజలకు దూరం చేయాలని అనుకుంటే, భారత దేశ ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఈ దేశ రక్షణ కోసం పార్లమెంటు లోపల ఉన్నా పార్లమెంటు నుండి నన్ను బహిష్కరించినా ప్రశ్నిస్తూనే ఉంటానని అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను కానీ వెనకడుగు వేసేది లేదని రాహుల్ గాంధీ గారు సమాధానం ఇవ్వడం జరిగింది.

ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ గారు ప్రశ్నించినట్లుగా 23 వేల కోట్ల రూపాయల ఆదాని పెట్టుబడిలపై జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ వేయాల్సిందేనని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బోఫోర్స్ కుంభకోణం పై, కామన్వెల్ కుంభకోణంపై, 2జీ కుంభకోణం పై జాయింట్ యాక్షన్ పార్లమెంటరీ కమిటీ వేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం జరిగిందని దమ్ముంటే నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ప్రధాని ఆర్థిక లావాదేవీల పై జేపీసీ వేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని లేదంటే రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదని ఈ దేశానికి దేశ ప్రజలకు జరుగుతున్న అన్యాయం పై పోరాటం కొనసాగుతుందని హెచ్చరించినారు.

ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు వైద్యుల అంజన్ కుమార్, సమద్ నవాబ్, ఎండి తాజ్, పత్తి కృష్ణారెడ్డి, వెన్న రాజ మల్లయ్య, మడుపు మోహన్, మల్యాల సుజిత్ కుమార్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, సయ్యద్, అఖిల్, నాగి శేఖర్, గడ్డం విలాస్ రెడ్డి, కాడే శంకర్, బొబ్బిలి విక్టర్, కొరివి అరుణ్ కుమార్, పొన్నం మధు, కంది తిరుపతి రెడ్డి, పురుమళ్ళ మనోహర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, బాల బద్రి శంకర్, శ్యామ్ సుందర్, ఎర్ర శ్రీనివాస్, నెల్లి నరేష్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, మామిడి సత్యనారాయణ రెడ్డి, షబానా మహమ్మద్, జీడి రమేష్, సలీముద్దీన్, ఎస్ డి అజ్మత్, బత్తిని చంద్రయ్య గౌడ్, రాజ్ కుమార్, నదీమ్, ఆశిక్ పాషా, హనీఫ్, నాగుల సతీష్, ముక్క భాస్కర్, ముల్కల కవిత, పరదాల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *