రేపు చెంగిచెర్ల 2వ డివిజన్ లో త్రాగునీటిని ప్రారంభించనున్న మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ కనకదుర్గ కాలనీ పేస్-1, 2,3,4,5, అణుశక్తి నగర్, శ్రీ హరి ఎంక్లేవ్, జై శ్రీరామ్ నగర్ తదితర కాలనీలలో స్థానిక కార్పొరేటర్ కం డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ ల ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీటి సరఫరాను ప్రారంభించడానికి ముఖ్య అతిధులుగా తెలంగాణరాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విచ్చేసి ప్రారంభిస్తారు.
ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ మాట్లాడుతూ రేపు చెంగిచెర్ల అదేవిధంగా 2వ డివిజన్ ప్రజలకుత్రాగునీరుఅందించడానికి,స్థానిక ఎమ్మెల్యే,మంత్రి ఛామకూర మల్లారెడ్డి విచ్చేసి ఈ త్రాగునీరు సరఫరాను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కాబట్టి 2వ డివిజన్ లోని అన్ని కాలనీల ప్రజలు, నాయకులు, కాలనీ వాసులు పాల్గన్ని ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయాలాని పిలుపునిచ్చారు.