బ్లాంక్ చెక్కులుగా… బోడుప్పల్ టౌన్ ప్లానింగ్ లో ఫిర్యాదులు

బ్లాంక్ చెక్కులుగా… బోడుప్పల్
టౌన్ ప్లానింగ్ లో ఫిర్యాదులు

  • ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తే.. అన్నిసార్లు లంచం ఇవ్వాల్సిందేనా?
  • స్థానిక కార్పొరేటర్ కు సైతం లంచం ముట్టిందా..?
  • లేని పక్షంలో అక్రమ నిర్మాణాలు ఎందుకు ఆగడం లేదు..?
  • త్వరలో కోర్టును ఆశ్రయించనున్న ఆంజనేయనగర్ అభివృద్ధి కమిటీ..

బోడుప్పల్, మే 25 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ ఆంజనేయ నగర్ లో ప్రధాన రహదారిపై పిల్లర్లు వేసి 56 గజాలలో బహుళ అంతస్తుల అక్రమ వాణిజ్య భవనం నిర్మిస్తున్నారని జిల్లా కలెక్టర్ తో పాటు బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా మౌన వ్రతం దాల్చడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో సదరు నిర్మాణ దారు మూడు వైపులా సెట్ బ్యాక్ లేకుండా రహదారిపై పిల్లర్లు వేసి షట్టర్ల నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.

నూతన మున్సిపల్ చట్టం ప్రకారం స్థానిక కార్పొరేటర్ సైతం ఈ అక్రమ నిర్మాణానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరించారు. కాగా కార్పొరేటర్ కు తాము లంచం ఇచ్చే నిర్మాణం కొనసాగిస్తున్నామని ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా తమ నిర్మాణ పనులను అడ్డుకోలేరని సదరు నిర్మాణం దారు బహిరంగంగా ప్రచారం చేయడం విశేషం. అదేవిధంగా మా వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నారని ఎవరెన్ని చెప్పినా, ఎన్ని పీర్యాదులు చేసినా మాకు ఏం కాదనట్లు వ్యవహరిస్తున్నారు.
సదరు నిర్మాణంపై జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ కు సైతం పలుసార్లు ఫిర్యాదు చేసిన స్థానికులు జీకే స్వామి గురువారం మరోసారి మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదును అందజేశారు. ఇదే మున్సిపల్ డివిజన్ లోని వెంకటేశ్వర కాలనీ జాన్సన్ గ్రామర్ స్కూల్ సమీపంలోనూ మరో వివాదం చెలరేగుతుంది. అదేవిధంగా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో జీరో పర్మిషన్ తో బహుళ అంతస్తుల వాణిజ్య భవనం నిర్మాణం సైతం కొనసాగుతున్నా.. మున్సిపల్ కార్పొరేషన్ లోని ఏడవ డివిజన్ వైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

తాము ఫిర్యాదు చేసినప్పుడల్లా టౌన్ ప్లానింగ్ అధికారులకు బ్లాంక్ చెక్ ఇచ్చినట్లుగా పండగ చేసుకుంటున్నారని, ఫిర్యాదు వచ్చింది డబ్బులు కురిపించండి అంటూ సదరు నిర్మాణ దారుల వద్దకు వెళ్లి వసూలు చేయడం కొనసాగుతుందని ఆరోపణలున్నాయి. ఏడవ డివిజన్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఆంజనేయ నగర్ డెవలప్మెంట్ కమిటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతుందని కాలనీ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. ఆంజనేయ నగర్ నిర్మాణంపై సహ చట్టం ప్రకారం దరఖాస్తు చేశారని పూర్తి వివరాలతో న్యాయస్థానం ద్వారా అధికారులు నూతన మున్సిపల్ చట్టం ప్రకారం స్థానిక కార్పొరేటర్ పై చర్యలకు ముందుకు వెళ్లనున్నట్లు వారు ప్రకటించారు.

ఉప్పల్ జిహెచ్ఎంసి పరిధిలో రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఉప్పల్ సర్కిల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు బయటకు వచ్చిన స్లాబ్ లను కూల్చివేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు కోకోళ్ళలుగా పుట్టుకొస్తున్నాయని జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో, మున్సిపల్ కమిషనర్ కు సంవత్సర కాలంగా దరఖాస్తులు పెట్టిన ఫలితం లేకుండా పోయిందని, ఉప్పల్ అధికారులకు ఒక రూల్, బోడుప్పల్ అధికారులకు మరో రూలా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్, మంత్రి, సిడి ఎంఏ అధికారులు, కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు తేరుకొని ప్రజావాణిలో ఇచ్చినటువంటి దరఖాస్తుల మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *