మొద్దు నిద్రలో బండ్లగూడ జాగిర్ వాటర్ బోర్డు అధికారులు

మొద్దు నిద్రలో బండ్లగూడ
జాగిర్ వాటర్ బోర్డు అధికారులు

  • ఏండ్లు గడుస్తున్నా మంచినీరు అందని పలు కాలనీలు:మాజీ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

బండ్లగూడ జాగిర్, ఫిబ్రవరి 8 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ వార్డులో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మంచినీరు అందకపోవడం చాలా బాధాకరమైన విషయం అని రెండు రిజర్వాయర్లు శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాటిలో ఇప్పటివరకు చుక్క మంచినీరు రాలేదు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఉన్నత అధికారులను కలిసిన ఇదిగో వస్తున్నాయి అని కాలయాపన చేస్తున్నారు తప్ప మంచినీరు ఇవ్వడంలో వాటర్ బోర్డు విఫలమైందన్నారు.

మొదటి వార్డులో వెంకటేశ్వర నగర్, విద్యానగర్ ఫేస్ 2, శివ సాయి నగర్, డిఎంఆర్ విష్ణుపురి కాలనీ, వాల్మీకి నగర్, దత్తాత్రేయ నగర్, రంగారెడ్డి నగర్, సుబ్రహ్మణ్యం ఫేస్ 4, ఇందిరమ్మ కాలనీ వంటి పలు కాలనీలలో మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు నెలకు ₹1,500 వరకు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు.

ఇప్పటికైనా వాటర్ బోర్డు అధికారులు ఈ యొక్క విషయమును దృష్టిలో ఉంచుకొని అతి త్వరలో వీరికి మంచినీళ్లు అందించాలని స్థానిక మాజీ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ మరియు రమణారెడ్డి గారు కోరుచున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *