ప్రజలకు శుభవార్త.. మీ సేవలో
రేషన్ కార్డు దరఖాస్తులు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విశ్వం న్యూస్) : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మీ సేవల్లో రేషన్ కార్డు దరఖాస్తులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులు కావాలంటే దరఖాస్తు ఎలా చేసుకోవాలో..? ఆ విధానం ఎలానో తెలుసుకోండి.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. గతంలో ప్రజాపాలన సదస్సులు ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో భారీగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ ప్రజాభవన్తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులు వస్తున్నాయి.
మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని డుప్లికేట్ లేకుండా అర్హులకు అందేందుకు వీలుంటుందని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. తెల్లరేషన్ కార్డు కోసం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు లోపు వార్షికాదాయం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాల గరిష్ఠ పరిమితిని ప్రభుత్వం విధించింది.