కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో
దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ

హైదరాబాద్, మార్చి 9 (విశ్వం న్యూస్) : కేంద్రమంత్రి, బొగ్గు, గనుల శాఖ మంత్రివర్యులు, సికింద్రాబాద్ పార్లమెంటరీ MP శ్రీ. జి. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పరికరాలను అందజేసే కార్యక్రమం ఈరోజు స్థానిక రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ సౌజన్యంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ. లంకాల దీపక్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు BJP MLA అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన వారు, అలాగే గూడూరి శ్రీధర్ రెడ్డి BJP నాయకులు, ఫంక్షన్ హాల్ పార్ట్నర్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గౌరవనీయ జాతీయ మంత్రివర్యులు శ్రీ. జి. కిషన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి కావ్య రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఘన సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించారు.

సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారిలో శ్రీ. డా. గూడూరి చెన్నారెడ్డి, శ్రీమతి డా. గూడూరి విజయలక్ష్మి, శ్రీమతి చింతపల్లి శోభా రెడ్డి, జి. మహేందర్ రెడ్డి, జి. కళ్యాణి రెడ్డి, మాస్టర్ డాన్సర్ జి. వన్ రాజ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు మద్దతుగా నిలిచి, వారికి అవసరమైన పరికరాలను అందించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *