నేడే బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్! ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ

  • 10 మంది సిట్టింగ్‌లకు నో ఛాన్స్?
  • ఈ నెల 25న రెండవ లిస్టు

హైదరాబాద్‌, ఆగస్టు 21 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సమయం సైతం ఫిక్స్ అయింది. ఇవాళ పంచమి కావడంతో మధ్యాహ్నం బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2018 ఎన్నికల సమయంలో ఒకేసారి 105 మందితో మొదటి జాబితా ప్రకటించగా.. ఈసారి కూడా 87 మందితో తొలి జాబితా ఉంటుందని ప్రచారం జరగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా వేదికగా అభ్యర్థులను ప్రకటించనున్నారు.

అందుకు సంబంధించిన తొలి జాబితాను సిద్ధం చేశారు. అయితే తొలి జాబితా విడుదల కానునడంతో సిట్టింగ్లతో పాటు ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అని ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నేడు తెరపడనుంది…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *