హుజూరాబాద్‌లో జమదగ్ని, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్‌కుమార్‌కు సన్మానం

హుజూరాబాద్‌లో జమదగ్ని, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్‌కుమార్‌కు సన్మానం

హుజూరాబాద్, మే 1 (విశ్వం న్యూస్) : హుజూరాబాద్ పట్టణంలో పలువురు ప్రముఖులకు ఘన సన్మానం నిర్వహించారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నూతన పాలకవర్గ సమావేశంలో జమదగ్నిని కోఆప్షన్ సభ్యునిగా ఎన్నుకున్నారు. గతంలో మండల విద్యాశాఖ అధికారిగా సేవలందించిన జమదగ్ని, పదవీ విరమణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ కోఆప్షన్ సభ్యునిగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, జి. బిక్షపతి, విష్ణు తదితరులు జమదగ్నికి పూలదండలు, శాలువాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే హుజూరాబాద్ నియోజకవర్గ వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రవణ్‌కుమార్‌ను తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో సన్మానించారు. శాలువా కప్పి, పూలదండలు వేసి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, డాక్టర్ శ్రవణ్‌కుమార్ నిజాయితీగా విధులు నిర్వహిస్తూ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆరోగ్య సిబ్బంది సమయపాలనతో పని చేయాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు జి. బిక్షపతి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *