ఓఆర్ఆర్ ప్రమాద
బాధితులకు కేటీఆర్ నివాళి

హైదరాబాద్, మే 2 (విశ్వం న్యూస్) : కేటీఆర్ శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీ వద్ద ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిరిసిల్లకు చెందిన ఆరుగురు బాధితులకు ఘన నివాళులర్పించారు. మృతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఆయన సంతాపం తెలిపారు.

అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, తమ ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఒకే ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అకాల మరణం చెందడం తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

పోస్టుమార్టం తదితర ప్రక్రియలు పూర్తయిన అనంతరం మృతదేహాలను అంబులెన్స్‌లలో వారి స్వగ్రామమైన సిరిసిల్లకు తరలించారు. అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తయ్యే వరకు కేటీఆర్ అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఈ ఘటనతో సిరిసిల్లతో పాటు హైదరాబాద్‌లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.