జమ్మికుంట: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ
శ్రీ వెంకటేశ్వర స్వామి
ఆలయంలో చోరీ

జమ్మికుంట, జూన్ 27 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడి అమ్మవారి మెడలోని బంగారు ఆభరణాలు (సుమారు 9 తులాలు) ఆలయంలో ఉన్న ఉండి లోని నగదు ఎత్తుకెళ్లినట్టు సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు ఆలయానికి చేరుకొని కరీంనగర్ నుండి క్లూస్ టీం రప్పించి దొంగల వేలిముద్రలు సేకరిస్తున్నారు.
ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వలన దొంగలను పట్టుకునే విషయంలో కొంత సమయం వెచ్చించవలసి వస్తుందని అయినా ప్రత్యేక దృష్టి ఉంచి తొందరంగా పట్టుకుంటామని స్థానిక పోలీసులు హెడ్ కానిస్టేబుల్ మోహన్, మధు, మల్లయ్య తెలిపారు.
