ఖబర్దార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

*చిల్లర మాటలు మానుకో..
మంచి వ్యక్తిగా మేలుకో..
*పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధికార
ప్రతినిధి కవిడ కుమార్ డిమాండ్
పీర్జాదిగూడ, మే 14 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అదేవిధంగా నేను ఒక కురుమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా డిమాండ్ చేస్తున్నాననీ కవిడ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కవిడ కుమార్ మాట్లాడుతూ ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి, ఒక గల్లీ చిల్లర రౌడీ లాగా మాట్లాడి రాష్ట్ర ప్రజలకు, యువతకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారూ మాకైతే అర్థం కావట్లేదనీ హెచ్చరించారు.
గొల్ల కురుమలు అంటే సమాజంలో చాలా మర్యాదస్తులుగా మంచి వ్యక్తులుగా ప్రేమ ఆప్యాయతలు ఉన్న సామాజిక వర్గమని పేరు ఉంది, కానీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ యాదవ కులంలో పుట్టి పెరిగి ఒక ఉన్నత స్థానంలో ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి తన స్థాయి దిగజార్చుకోవడమే కానీ మరోటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఏనాడు కనబడని, వినబడని మీరు ఈరోజు వాళ్ళ కాళ్ళ కాడ కాపలా కుక్క లెక్క కాపు కాస్తున్నారని అన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి దొరల మెప్పు పొందుతావేమో గాని యాదవ కులస్తులు మాత్రం భవిష్యత్తులో నీకు సరైన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.