ప్రభుత్వ భూముల అక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూముల అక్రమిస్తే కఠిన చర్యలు

మేడిపల్లి తహసీల్దారు మహిపాల్ రెడ్డి
మేడిపల్లి, మే 14 (విశ్వం న్యూస్) : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి తహసీల్దారు మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం మేడిపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 63 ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి రాత్రికి రాత్రే ఇండ్ల నిర్మాణం చేసి అమ్ముకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో కూల్చివేస్తున్నామని తెలిపారు. కోర్టు ఆర్డర్ పేరుతో నిర్మాణాలు చేస్తున్నారని వాటిని న్యాయ నిపుణుల సలహతో కూల్చివేస్తున్నాం.

అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *