మహాత్మా గాంధీ మనుమడు
అరుణ్ గాంధీ కన్నుమూత

ముంబయి, మే 2 (విశ్వం న్యూస్) : మహాత్మా గాంధీ మనువడు అరుణ్ గాంధీ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో తుదిశ్వాస విడిచారు.
ఈరోజు కొల్హాపూర్‌లో అరుణ్ గాంధీకి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు. మనీలాల్ గాంధీ, సుశీల మషుర్వాలా దంపతులకు 1934, ఏప్రిల్ 14వ తేదీన డర్బన్‌లో అరుణ్ గాంధీ జన్మించారు.