అలుగునూర్ లో డా.రసమయి బాలకిషన్ తొలిపొద్దు పర్యటన

అలుగునూర్ లో డా.రసమయి బాలకిషన్ తొలిపొద్దు పర్యటన

తిమ్మాపూర్, జనవరి 20 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని అల్గునూర్ (8వ డివిజన్)లో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ శుక్రవారం వేకువ జామున తొలిపొద్దు పర్యటనలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తూ, ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యల ను పరిష్కరించారు. గ్రామంలోని లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్ళి కళ్యాణా లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా గ్రామ ప్రజా ప్రతిని ధులు, అభిమానులు, ప్రజలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఘన స్వాగతం పలికి, సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సింగి ల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, 8వ డివిజన్ కార్పొరేటర్ సల్ల శారద- రవీందర్, తాహసిల్దార్ కనకయ్య, తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ రావుల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు జాప శ్రీనివాస రెడ్డి, నాయకులు జాప రవీందర్ రెడ్డి, కంది రామచంద్రా రెడ్డి, దాసం కమలా కర్ తో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *