ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

తిమ్మాపూర్, జనవరి 12 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ (20 23) ను గురువారం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ట్రాక్టర్ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు దుండ్ర రాజయ్య యాదవ్, తిమ్మాపూర్ గ్రామ ఉప సర్పంచ్ కేతిరెడ్డి తిరుపతి రెడ్డి, పిఎసిఎస్ సోసైటి డైరెక్టర్ గంకిడి సత్యనారాయణ రెడ్డి, ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు మాతంగి శంకర్, గౌరవ అధ్యక్షులు తక్కిటి శ్రీనివాస్ రెడ్డి, గౌరవ సలహాదారు మాధన వీరన్న, ఉపాధ్యక్షుడు రామంచ రాంరెడ్డి, సహయ కార్యదర్శి శేరి రమేష్, కోశాధికారి చిలుకూరి కుమార్, మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల ప్రభాకర్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎడ్ల చిన్న జోగిరెడ్డి, వెల్పుల మల్లయ్య యాదవ్, పెరుక సంఘం అధ్యక్షుడు మాధన రాజేందర్, ఎడ్ల బుచ్చి రెడ్డి, దొనపాటి కోమాల్ రెడ్డి, కేతిరెడ్డి రాజిరెడ్డి, వెల్పుల అనిల్ కుమార్, పోన్నాల సంపత్, కేతిరెడ్డి తిరుపతి రెడ్డి, ఇట్నేని కనుకయ్య దుండ్ర రవి తదితరులు పాల్గొన్నారు.