ఆజాద్‌ జయంతికి ఘన నివాళులు

ఆజాద్‌ జయంతికి ఘన నివాళులు

కరీంనగర్‌, నవంబర్ 11 (విశ్వం న్యూస్): మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్‌ డిసిసి కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎం.డి. తాజుద్దీన్‌ ఆధ్వర్యంలో అజాద్‌ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి, హుజూరాబాద్‌ పట్టణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, సొల్లు సునీత, జూపాక మల్లీశ్వరి, కల్పన తదితర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అందరూ అజాద్‌ గారి సేవలను స్మరించుకుంటూ, దేశ విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *