బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను ప్రకటించడం పట్ల హర్షం

- తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
కరీంనగర్, మే 7 (విశ్వం న్యూస్) : బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా కే.టీ.ఆర్ ప్రకటించడం పట్ల ఒక ప్రకటనలో ముజాహిద్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు గతంలో ఎన్నో రకాల ఉద్యమాలు చేపట్టి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్న పార్టీలను ఏకం చేసి, తెలంగాణ రాష్ట్రం ప్రకటించడానికి సంపూర్ణంగా మద్దతును కూడగట్టే విషయం లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్.
2024 లో పార్లమెంట్ ఎన్నికలలో బోయిన పల్లి వినోద్ కుమార్ ను బి.అర్.ఎస్ ఎం.పి అభ్యర్థి గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుస్నాబాద్ పట్టణంలో ప్రకటించటం చాలా సంతోషమైన విషయం అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వినోద్ కుమార్ ఇలాంటి వ్యక్తి సొసైటీలో చాలా మంచి గుర్తింపు పొందినారు. ఆయన దగ్గరికి వెళితే ఏ పని ఐనా సాధ్యమైనంత వరకూ పరిష్కారం అవుతుందని ప్రతి ఒక్కరికి నమ్మకం అని కొనియాడారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా బి వినోద్ కుమార్ కొనసాగుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో హుజురాబాద్ హుస్నాబాద్ మానకొండూరు కరీంనగర్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల ఏడు నియోజకవర్గాలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వస్తాయి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మనస్ఫూర్తిగా ఆయనకు మద్దతు ఇచ్చి, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించుకున్నట్లయితే ప్రజలకు ఎన్నో రకాల సేవలు మనకు వినోద్ కుమార్ ద్వారా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు అంటూ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు.