92ఏళ్ల ఏజ్‌లో రికార్డ్-ఓటమి ఎరుగని పెద్దాయన
92ఏళ్ల ఏజ్‌లో రికార్డ్:ఓటమి
ఎరుగని పెద్దాయన

దటీజ్ శివశంకరప్ప!
కర్ణాటక, మే 13 (విశ్వం న్యూస్) : కర్ణాటక రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అత్యంత వయోవృద్ధుడైన అభ్యర్థిగా నిలిచిన శామనూరు శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన శివశంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
శామనూరు శివశంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నాయకుడు. ఇప్పుడు ఆయన వయసు 92 ఏళ్లు. ఈ వయసులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఎంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో శంకరప్పకు పోటీగా బీజీపీ బీజీ అజయ్‌కుమార్‌ను నిలబెట్టింది. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలకు అజయ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు మరోసారి శివశంకరప్పకే పట్టం కట్టారు. దీంతో జీజేపీ వ్యూహం బెడిసికొట్టింది.
శివశంకరప్ప రాజకీయ ప్రస్థానం ఇలా..
1994- రాజకీయాల్లోకి అరంగేట్రం
1994- దావణగెరె మునిసిపల్
కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నిక
1994- దావణగెరె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
1997- లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు
1999- లోక్‌సభ ఎన్నికలకు
పోటీ చేసి ఓటమి
2004- దావణగెరె ఎమ్మెల్యేగా
మరోసారి గెలుపు
2008, 2013, 2018 ఎన్నికల్లో వరుసగా
మూడుసార్లు దావణగెరె
దక్షిణ ఎమ్మెల్యేగా విజయం
2023- అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం
