రంగారెడ్డి

ఘనంగా బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి

ఘనంగా బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి

పాల్గొన్న కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్
బండ్లగూడ జాగిర్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ వార్డు ఇందిరమ్మ కాలనీ jnnurm ఫేస్ 1 లో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ ఘనంగా నిర్వహించారు. తలారి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలు వారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని చాలా గొప్పగా రాసారని కొనియాడారు.

ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశించారు. పేద ధనిక తేడా తారతమ్యం లేకుండా వారు రాసారన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ ప్రెసిడెంట్ రాజు, వైస్ ప్రెసిడెంట్ దిలీప్, లక్ష్మణ్, సాయి, దేవి, మల్లేష్, బలరాం, బలవంత్, వెంకటేష్, రాధిక, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *