Today TrendingVishwam Newsజాతీయంతాజా వార్తలుతెలంగాణ

ఢిల్లీలో రేపు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

ఢిల్లీలో రేపు బిఆర్ఎస్ పార్టీ
కార్యాలయం ప్రారంభోత్సవం

  • రేపు దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు
  • బసంత్ విహార్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం (బిఆర్ఎస్ భవన్)
  • వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం అత్యంత వైభవోపేతంగా నిర్మితమైన బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం

ఢిల్లీ, మే 3 (విశ్వం న్యూస్) : ఢిల్లీ కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడాది ప్రారంభించిన నాలుగు అంతస్తుల బీఆర్‌ఎస్‌ పార్టీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా, రైతు రాజ్య స్థాపనే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఢిల్లీలోని బసంత్ విహార్ లో మే 4 (గురువారం)న అత్యంత అట్టహాసంగా ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ఉనికిలోకి రానుండటంతో బిఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త విస్తరణ వేగవంతం కానున్నది. బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా…. అత్యంత ప్రామాణికమైన వాస్తుశాస్త్ర సూత్రాలను అనుసరించి నిర్మించిన కార్యాలయంలోకి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి అడుగుపెట్టనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు ఢిల్లీ బిఆర్ఎస్ భవన్ నిర్మాణానికి సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

  • బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలు:
  • Lg(లోయర్ గ్రౌండ్), గ్రౌండ్ ఫ్లోర్ మరియు మూడు ఫ్లోర్స్
  • 1500 గజాలు 20000 స్క్వేర్ ఫీట్స్
  • Lg లో మీడియా హాల్ మరియు సర్వెంట్ క్వార్టర్స్
  • గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్ ,రిసెప్షన్ లాబీ,4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్ లు
  • మొదటి ఫ్లోర్ లో జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి ఛాంబర్, పేషీ ఛాంబర్స్ మరియు కాన్ఫరెన్స్ హాల్
  • 2,3 వ అంతస్తులో మొత్తం 20 రూమ్స్ .. అందులో రెండు సూట్స్, 1 ప్రెసిడెంట్ సూట్ 2.వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్
  • మిగతా 18 రూమ్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *