ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి:తాసిల్దార్ రాజకుమార్
ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ
కోసం దరఖాస్తు చేసుకోవాలి:
తాసిల్దార్ రాజ్ కుమార్

గోవిందరావుపేట, మే 3 (విశ్వం న్యూస్) : ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్నటువంటి వారు ఇంటి స్థల క్రమబద్ధీకరణ కోసం స్థానిక మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని గోవిందరావుపేట తహసిల్దార్ అల్లం రాజకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
జీవో నెంబర్ 58,59 ప్రకారం 2020 జూన్ రెండవ తారీకు లోపు వరకు ఎవరైతే స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారో వారికి ప్రభుత్వం హక్కులు కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశం మే 31వ తేదీ వరకు ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
