కరీంనగర్

ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కొడుకు దీక్షిత్ హీరోగా సినిమా

ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
కొడుకు దీక్షిత్ హీరోగా సినిమా

క్లాప్ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
కొండగట్టు, మే 4 (విశ్వం న్యూస్) : చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కుమారుడు దీక్షిత్ హీరోగా అమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. క్రైం సస్పెన్స్ కథాంశంతో కూడుకున్న ఈ చిత్రాన్ని నిమ్మల సతీష్ నిర్మిస్తున్నాడు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే సుంక రవిశంకర్ చేతుల మీదిగా క్లాప్ కొట్టి ప్రారంభించారు.

అంతకుముందు చిత్ర యూనిట్ ఆలయాలలో పత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నా రెండవ చిత్రం ఇది. క్రైం సస్పెన్స్ నేపధ్యంలో సాగె ఈ సినిమాకి యువ దర్శకుడు జిఎస్ గౌతంకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

దీక్షిత్ హీరోగా నటిస్తుండగా, నవ్య శ్రీనివాస్ హీరోయిన్ గా, ప్రముఖ నటులు సుమన్, కోటేశ్వరవు సుజాత, జీవ నటినటులుగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యానర్లో టైం పాస్ సినిమా తెరకెక్కగా ఓటీటీ లో హాలచెల్ చేసింది. ఇందులో కెమెరామెన్ శివ, సర్వేశ్వర్, శ్రీను, వెంకీ, కార్తీక్, టోనీ, శ్రీధర్, వెంకటేష్, రమేష్, అమ్మ ప్రొడక్షన్స్ యూనిట్ సభ్యులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *