Vishwam Newsకరీంనగర్

కరీంనగర్:ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలు

కరీంనగర్:ప్రయివేటుకు
ధీటుగా ప్రభుత్వ పాఠశాలు

  • రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ – రావుల శ్రీధర్
  • జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్

తిమ్మాపూర్, మే 19 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం రాష్ట్ర విద్యా సంస్థల సంక్షేమ మౌలిక వసతుల కార్పోరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ ఎల్ పి కార్య దర్శి మాదాడి రమేష్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ లతో కలిసి సందర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించామని, ప్రతి పేద వాడికి నాణ్య మైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’లో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 వేల కోట్లతో  26 వేల పాఠశాలల్లో భవనాలు, మరుగుదొడ్లు, నీటి వసతి, బోధన, క్రీడా సామగ్రి, సాంకేతిక విద్య వంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.

ఒక కరీంనగర్ జిల్లాలోనే 230 పాఠశాలలకు రూ. 90 కోట్లు కేటాయించామన్నారు. అదే విధంగా పర్లపల్లి స్కూల్ ను 47 లక్షల నిధులతో జిల్లాలోనే మాడల్ స్కూల్ గా తీర్చిదిద్దారన్నారు. పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. జూన్ మాసంలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని కోరారు. అంతకముందు సర్పంచ్ మాదాడి భారతి దేవిని ఆయన అభినందించారు. పర్లపల్లి పాఠశా లలు చాలా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాదాడి భారతి నర్సింహా రెడ్డి, పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. పర్లపల్లి గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మిగిలిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి, ఎంపిడిఓ, పంచాయతీరాజ్ శాఖ ఈఈ, ఏఇ, స్థానిక ఎంపిటిసి ముప్పిడి సంపత్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజేష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *