కరీంనగర్

1977 గో-హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి

1977 గో-హత్య నిషేధ చట్టాన్ని
కఠినంగా అమలు చేయాలి

  • గోరక్ష ప్రముఖ్ విభాగ్ డిమాండ్

కరీంనగర్, మే 19 (విశ్వం న్యూస్) : కరీంనగర్ లోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాల యంలో ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోరక్ష విభాగ్ కార్యవర్గ సమావేశంను జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గోరక్ష ప్రముఖ్ విభాగ్ కార్య దర్శి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1977 గో-హత్య నిషేధ చట్టాన్ని వెంటనే కఠినంగా అమలు చేయాలని, ప్రతి జిల్లాలో కనీసం 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వమే గోశాలను ఏర్పాటు చేయాలి, అక్రమ గో రవాణాను అడ్డుకునేందుకు శాశ్వత పోలీస్ వ్యవస్థ ఏర్పాటు, గో ఆధారిత వ్యవసాయదారులకు 100 శాతం సబ్సిడీ, గోమాత పట్ల సమాజంలోని అందరిలోని భక్తిని ప్రేమని పెంపొందించాలని, గో ఆధారిత ఉత్ప త్తులను ప్రోత్సహించాలని కోరుతూ పిలుపు నిచ్చా రు.

ఈ నెల 25వ తారీఖు (శనివారం) రోజున కరీంనగర్ లోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఉ. 10 గంటలకు 6 జిల్లాలు అయినా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల్, మంచిర్యాల్, సిరిసిల్ల, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల గోరక్ష ప్రముఖ్ విభాగ్ బైటక్ ప్రత్యేక సమా వేశంను ఏర్పాటు చేయనున్నారు.

కావున ఆయా జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా గోరక్ష ప్రముఖ్ విభాగ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గోరక్ష ప్రముఖ్ విభాగ్ అధ్యక్షులు మధుసూదన్ రావు, జిల్లా కార్యదర్శి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, ధర్మ ప్రచార విభాగ్ విఠలాచారి, నగర అధ్యక్షులు ఇనగంటి రమేష్, జగదీష్, బజరంగ్ దళ్ ప్రదీప్ కుమార్, భజరంగల్ కో కన్వీనర్ కన్నం శంకర్, సాయి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *