ఐపీఎస్ హోదా పొందిన పుల్ల కరుణాకర్‌కు ఘన సన్మానం

ఐపీఎస్ హోదా పొందిన పుల్ల కరుణాకర్‌కు ఘన సన్మానం

ఐపీఎస్ హోదా పొందిన పుల్ల కరుణాకర్‌కు ఘన సన్మానం

విశ్వం న్యూస్/హైదరాబాద్, ఆగస్టు 26: ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా లభించిన సందర్భంగా తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఘనంగా సన్మానించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉదయ్ ప్రకాష్ గుప్తా నాన్‌-క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల కరుణాకర్ గతంలో వాణిజ్య పన్నుల శాఖలో గ్రూప్-2 ద్వారా ఏసీటీఓగా పనిచేసి, అనంతరం గ్రూప్-1 సాధించి డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరారని తెలిపారు. 2009లో డీఎస్పీగా ఉద్యోగం సాధించిన ఆయన తొలిపోస్టింగ్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించారని, అనంతరం హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో డీసీపీగా సేవలందించి ప్రస్తుతం హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *