మేడిపల్లి పి ఎన్ టి కాలనీలో ఎస్ఎస్ ఇంటరీయర్ హబ్ ను ప్రారంభించిన మేయర్ జేవీఆర్
మేడిపల్లి పి ఎన్ టి కాలనీలో ఎస్ఎస్ ఇంటరీయర్ హబ్ ను ప్రారంభించిన మేయర్ జేవీఆర్

- మేయర్ జేవీఆర్, సిఐ గోవర్ధన గిరి హాజరు
- ఇంటరీయర్ స్పెషలిస్ట్స్ సంతోష్ కుమార్,
అమ్మ శ్రీను ఆధ్వర్యంలో..
పీర్జాదిగూడ, మార్చి 18 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి పిఎన్టి కాలనీ మెయిన్ రోడ్ లో ఎస్ ఎస్ ఇంటరీయర్ హబ్ ను ప్రారంభించిన మేయర్ చెక్క వెంకటరెడ్డి. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మేడిపల్లి పీఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవర్ధనగిరి చేతుల మీదుగా ఎస్ఎస్ ఇంటరీయర్ హబ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎన్టి కాలనీలో ఎస్ఎస్ ఇంటరీయర్ హబ్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఇంటరీయర్ స్పెషలిస్ట్స్ సంతోష్ కుమార్, అమ్మ శ్రీనులను ప్రత్యేకంగా అభినందించారు పీర్జాదిగూడ కార్పొరేషన్ మేడిపల్లి మండల ప్రాంతంలో అత్యధికంగా రియల్ ఎస్టేట్ రంగంలో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్ లు తదితర బిజినెస్ భారీగా కొనసాగుతుందని, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డర్స్ ఇంటీరియర్ హబ్ ఎస్ఎస్ వారి యొక్క పనులను వాడుకొని వారికి కూడా బిజినెస్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. దినదినం వీరి బిజినెస్ అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మేము ప్రారంభించిన ఈ ఎస్ఎస్ ఇంటరీయర్ హబ్ ఇంకా భారీగా అభివృద్ధి చెంది ముందుకెళ్లాలని దీవించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రసన్నలక్ష్మి శ్రీధర్ రెడ్డి, సుభాష్ నాయక్, సుమన్ నాయక్, గిరిజన సంఘాల చైర్మన్, మాజీ సర్పంచ్ రాజేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మణి రామ్ నాయక్, శ్రీను నాయక్, కుమార్ ,సునీల్ ,రాజేష్, జిఎం నాయక్, టిఖ్య నాయక్ యువత తదితరులు హాజరయ్యారు.

