లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట, మార్చి 29 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి, వెంకటేశ్వర్ల పల్లి, విలాసాగర్, బిజిగిరి షరీఫ్, తనుగుల, వావిలాల, నగురం, నాగారం, పాపక్కపల్లి, నాగంపేట్ శాయంపేట, తదితర గ్రామాలలో 63 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అలాగే సీఎంఆర్ఎఫ్ 8 చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటివద్దకే వెల్లి అందించిన గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పాడి కౌశిక్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ చేరువయ్యే విధంగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని సీఎం కేసీఆర్ సహకారంతో చెక్కులను అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మీకు తోడుగా ఉంటామని ప్రజలు చెప్పడంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు అమలు విషయాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

