రామ రాజ్యాన్ని తలపించేలా
కె.చంద్రశేఖర్ రావు పాలన
- కేసిఆర్ గారి నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్ష: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ, మార్చి 30 (విశ్వం న్యూస్) : రామ రాజ్యాన్ని తలపించేలా తెలంగాణలో కేసిఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు, కుల వృత్తులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. పేదలు, రైతులు అంటే పరితపించే కేసిఆర్ గారి నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్ష లాంటిదన్నారు.
రాముల వారి కళ్యాణంలో వేముల దంపతులు
శ్రీరామ నవమి పురస్కరించుకొని పోచంపాడ్ కోదండ రామాలయంలో రాములవారి కల్యాణోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి-నీరజా రెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి,వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోదండ రాముణ్ణి ప్రార్థించారు. కన్నుల పండువగా జరిగిన సీతారామ కల్యాణోత్సవం అనంతరం భక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మంత్రి వేముల దంపతులు స్వయంగా భక్తులకు వడ్డించారు.