రక్షించండి మహాప్రభు!

- తేలికపాటి వర్షాలకే పీర్జాదిగూడలో కాలనీలు జలమయం
- పట్టించుకోని అధికారులు, నాయకులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు-
- త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ
- పీర్జాదిగూడ సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు
- తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

మేడిపల్లి, మే 3 (విశ్వం న్యూస్) : మేడిపల్లి! పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిస్థితి చిన్నపాటి వర్షాలకు డ్రైనేజీలు పొంగుతూ,రోడ్లు కాలువలను,కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రజలు అకాల వర్షాల వల్ల పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మీడియాతో మాట్లాడుతూ..గత రెండు,మూడు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకే నగర ప్రజలు ఇటు వరదలతో,కరెంటు కోతలతో ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు.

అభివృద్ధిలో ఆదర్శం అని చెబుతున్న కార్పొరేషన్ లో ప్రారంభించిన డ్రైనేజీ,సిసి రోడ్డు నిర్మాణాల పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ లోని కొన్ని కాలనీలలో ఇళ్లలోకి పూర్తిగా వర్షపు నీరు చేరి వారి సరుకులు నానిపోయి అర్ధాకలి లతో అలమటిస్తున్నారు.ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గానీ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు,ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు మొద్దు నిద్ర వీడీ యుద్ధ ప్రాతిపదికన నీట మునిగిన కాలనీలను సందర్శించి ప్రజా సమస్యలను తీర్చాలని, రాబోయే వర్షాకాలం దృష్ట పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి వరదల బారి నుండి ప్రజలను రక్షించాలని, తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు.

లేదంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్ సమస్యలపై సంతకాల సేకరణ చేసి కలెక్టర్ దృష్టికి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తుంగతుర్తి రవి అన్నారు.
