మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరాం చక్రవర్తి

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరాం చక్రవర్తి

విశ్వం న్యూస్ / కరీంనగర్, మే 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్‌-చైర్మన్లను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరాం చక్రవర్తిని, వైస్‌-చైర్మన్‌గా అల్లం భాస్కర్‌ను నియమించింది.

ఈ నియామకాలపై పార్టీ శ్రేణులు, మున్నూరు కాపు సంఘాల నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతలను స్వీకరించిన నాయకులు సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *