హైదరాబాద్

బోడుప్పల్ నూతన కమిషనర్ ను కలిసిన డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్

బోడుప్పల్ నూతన కమిషనర్ ను కలిసిన డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్

మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ హాజరు
బోడుప్పల్, మార్చి 31 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఇటీవలే జాయిన్ అయిన నూతన కమిషనర్ వాణిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలుతో సత్కరించిన డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్. ఈ సందర్భంగా డిప్యుటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన కమిషనర్ వానిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు.

కమిషనర్ వాణి రెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల ప్రజలు అభివృద్ధిలో ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా కమిషనర్ తో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పాత టెండర్లు, అక్రమ కట్టడాలు తదితర విషయాలపై చర్చించగా కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, చీరాల నరసింహ, కో ఆప్షన్ రంగన్న తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *