హీరో విక్రమ్ కి ప్రమాదం..విరిగిన పక్కటెముక

హైదరాబాద్, మే 3 (విశ్వం న్యూస్) : విక్రమ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తెరకెక్కిస్తున్న ఒక యాక్షన్ ని సీక్వెన్స్ లోనే విక్రమ్ కి విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు.
ఆయన పక్కటెముక విరిగినట్లు తెలుస్తోంది. సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడంతో.. షూటింగ్‌ను నిలిపివేసి.. ఆస్పత్రిలో చేరారు విక్రమ్. ఊహించని ఈ ఘటనతో.. తంగలాన్ మూవీ చిత్రీకరణ నిలిచిపోయింది. ఆయన కోలుకున్న తర్వాత.. తిరిగి షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.
బి.ఇరంజిత్ దర్శకత్వం వహిస్తున్న తంగళాన్ చిత్రంలో నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చారిత్రాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తంగలాన్ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్.. నిన్న చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.
