పీర్జాదిగూడ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పీర్జాదిగూడ కార్యాలయంలో రాష్ట్ర
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పీర్జాదిగూడ, జూన్ 2 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, మేనేజర్ జ్యోతి రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యువత మహిళలు కార్యకర్తలు తదితరులు హాజరై జెండా వందనం గీతాన్ని ఆలపించారు.
