ధాన్యం తరలింపు వేగవంతంగా జరగాలి: కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
ధాన్యం తరలింపు వేగవంతంగా
జరగాలి: కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

కరీంనగర్ బ్యూరో, మే 3 (విశ్వం న్యూస్) : బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళ్లాల నుండి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన దాన్యాన్ని రైతుకు అసౌకర్యం కలగకుండా, వెనువెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్లు, మాయిస్చర్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉండాలని అన్నారు. ఎప్పటికప్పడు సక్రమంగా రికార్డుల నమోదు జరగాలని, కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు దాన్యం తరలించడానికి వాహనాలను అందుబాటులో ఉండెలా చూసుకోవాలని తెలిపారు. కేంద్రాల వద్ద అకాలవర్షాల నుండి దాన్యాన్ని సంరక్షించేలా టార్పలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని, సరైన మాయిస్చర్ వచ్చే వరకు దాన్యాన్ని రైతులు ఆరబెట్టాలని తెలిపారు. కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలకు బాద్యులవుతారని హెచ్చరించారు.

అదేవిధంగా మిల్లర్లు దాన్యం దిగుమతి చేసుకోవడంలో సమస్యలను సృష్టిస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ఎల్.ఎం.డి. కాలనీ లోని మానసిక వికాలంగుల పాఠశాల, వృత్తివిద్యా శిక్షణా కేంద్రాన్ని పరిశీలించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వికలాంగుల మనోవికాసానికి నేర్పిస్తున్న స్పీచ్ థెరపీ, వాయిస్ థెరపీ పద్ధతులను పరిశీలించారు. అనంతరం మానసిక వికలాంగులకు ఆటలు, నృత్యాలు వంటివి నేర్పించేందుకు సిబ్బందిని నియమించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలొ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్, పిడిడిఆర్డిఓ శ్రీలత, సహకారశాఖ అధికారి శ్రీమాల, జిల్లా సంక్షేమ అధికారి కే.సబితా, తిమ్మాపూర్ తహసిల్దార్ కనకయ్య, పాఠశాల ప్రిన్సిపల్ ఉమారాణి తదితరులు పాల్గోన్నారు.
