హామీ మరిచిన మంత్రి హరీష్ రావు
హామీ మరిచిన మంత్రి హరీష్ రావు

వీణవంక, మే 28 (విశ్వం న్యూస్) : ఉప ఎన్నికల సమయంలో వీణవంక మండలం ఇన్చార్జిగా వ్యవహరించిన రాష్ట్ర ఆర్థిక మాత్యులు తన్నీరు హరీష్ రావు వీణవంక మండలం చల్లూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తానని చేయక పోవడాన్ని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఖండించారు గత సంవత్సర ఉప ఎన్నికల సమయంలో మాట ఇవ్వడం జరిగింది.
అట్టి మాటను నీటి మూటల మార్చిన మంత్రిగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి ఇచ్చిన హామీలను మరవడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటు అందులో భాగంగానే ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అక్కడి సమస్యల పట్ల హామీలు ఇవ్వడం తర్వాత వాటిని అమలు చేయలేకపోవడం వారికే దక్కుతుంది తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఇలాంటి బూటకపు హామీలతోనే వస్తుంది ఇప్పటికైనా ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకొని చల్లూరు గ్రామాన్ని తక్షణమే మండలంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేనిపక్షంలో వారి హామీను గుర్తు చేస్తూ వారి సభలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఇలాంటి బూటకపు హామీలు ఇస్తూ ప్రజల మధ్యలో ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై తిరుగుబాటు తప్పదని వారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, వడ్డేపల్లి కొమురయ్య, ఈదునూరి పైడి కుమార్ ,గిరవైన సాయిలు, ఎండి రజాక్, ఎండి అన్వర్, తదితరులు పాల్గొన్నారు.
