Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

నిప్పుకణం కేసిఆర్

  • శ్రీదేవి మంత్రి (తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్)

హైదరాబాద్, మే 17 (విశ్వం న్యూస్) : సూర్యుడు మరణించడు. కోటికాంతుల రేపటి ఉషోదయాన్ని వాగ్దానం చెస్తూ అస్తమిస్తాడు. నిలువెల్లా విషం నింపుకున్న రాపోలులాంటి మూర్ఖులే సూర్యడు అంతమయ్యాడని భ్రమిస్తుంటారు. సూర్యుడు గతం అయితే ప్రకృతి ప్రశ్నార్థకమవుతుందని ఈ అజ్ఞానికి అర్థంకాదు. తెలంగాణ గడ్డమీద పొడిచిన పొద్దు బాపు కేసిఆర్.

తెలంగాణ ఉన్నంతకాలం బాపు కెసిఆర్ ఉంటాడు. సూర్యుడికి మరణంలేనట్టే మా బాపు కేసిఆర్ కూడా చిరంజీవే. అట్లాంటి బాపును “తెలంగాణకు కేసిఆర్ ఒక నిన్న”అంటాడు రాపోలు ఆనందభాస్కర్.
అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే అవకాశవాదికి బాపు కేసిఆర్ లాంటి దార్శనికుడు ఒక నిన్నలాగే కనబడుతాడు.

ప్రజా ప్రయోజనాలు,ప్రాంత అభివృద్ది రాపోలులాంటి వాళ్ళకు పట్టదు. ఎంగిలి మెతుకులు ఏరుకొని తినడమే వీళ్ళపని. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని భారీ విజయాలను అందుకొని ఘోరంగా విఫలమైన పార్టీ బిఆర్ఎస్ అంటూ కేసిఆర్ గారిపై విషంకక్కాడు రాపోలు. ప్రపుల్లకుమార్ మహంతా తరువాత కనుమరుగైన నాయకుడు కేసిఆరే అంటూ తన అక్కసును వెళ్ళగక్కాడు.

ప్రపుల్లకుమార్ మహంతా కు కేసిఆర్ కి చాలా తేడా ఉందని ఈ అవివేకికి అర్థంకాలేదు. బాపు కేసిఆర్ ఒక స్వతంత్రయోధుడు. ఒక ప్రాంతాన్ని చెరనుండి విడిపించిన విముక్తిప్రదాత బాపు కేసిఆర్. తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల గుండె లోతుల్లోంచి వచ్చింది.

వరిగడ్డి మంటలా భగ్గున మండి చప్పున చల్లారిపోయిన అస్సాంగణపరిషత్ లాంటి ఉద్యమం కాదు తెలంగాణ ఉద్యమం. అరవైఏళ్ళ ఆకలి,ఆక్రందనలనుండి పెల్లుబికిన లావా తెలంగాణ ఉద్యమం.

లావానుండి ఉద్భవించిన నిప్పుకణం బాపు కేసిఆర్. ఆ నిప్పును ఆర్పడం ఎవరితరంకాదు.‌
ఆరుదశాబ్దాల చీకటిని పారదోలిన వెలుగురేఖ బాపు కేసిఆర్. వెలుగుకు పట్టిన గ్రహణం తాత్కాలికమే.
ఆనందభాస్కర్ విచారించేరోజు త్వరలోనే వస్తుంది. విరిజిమ్మే కాంతిలా బాపు మళ్ళీ రేపు ఉదయిస్తాడు.

ఒక ప్రాంత దోపిడిదారుల పాదాలకింద నలిగిపోయిన అభాగ్యుల గుండెలోతుల్ని తడిమిన నాయకుడు బాపు కేసిఆర్. ఆ గుండెల తడిని అలుముకున్నవాడు కేసిఆర్. గుండెలోతుల్లోకి వెళ్ళాడుగనుకనే అనేక సంక్షేమ పథకాలకు ఊపిరిపోశాడు. అభివృద్ది పథకాలను కూడా రాపోలు చూడనిరాకరిస్తున్నాడు.
నిరంతరవిద్యుత్,మిషన్ భగీరథలో కూడా లోపాలు చూస్తున్నాడు. కాళేశ్వరం పగుళ్ళను భూతద్దంలో చూస్తున్నాడు. మనం చిన్న భవింతి కడితేనే కొన్ని లోపాలుంటాయని ఈ మేథావి కి తెలియదా?????

అంతపెద్ద ప్రాజెక్టులో ఉన్న చిన్న లోపాన్ని పెద్దది చేసి చూపుతున్నాడు. ప్రపంచం అబ్బురపడే రీతిలో నిర్మించిన బహుళార్దక ప్రాజెక్టు కాళేశ్వరంను నిరాకరించడం ప్రజాద్రోహమే అవుతుంది.

ద్రోహులు అల్లిన విషవలయంలో కూర్చొని విషంచిమ్మడంకాదు. దమ్ముంటే కరెంటు మీద, మిషన్ భగీరథమీద, మిషన్ కాకతీయమీద, రైతుబంధుమీద రాపోలు జనంలో చర్చపెట్టాలి. అప్పుడు ప్రజలే ఈ మేధావికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *