ప్రభుత్వ కళాకారుల మీద చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ కళాకారుల మీద
చర్యలు తీసుకోవాలి

- కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఇండియా జనశక్తి పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి శ్రీనివాస్
కరీంనగర్, ఏప్రిల్ 10 (విశ్వం న్యూస్) : కరీంనగర్లో జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశములో పాల్గొని పాటలు పాడిన ప్రభుత్వ కళాకారుల మీద చర్యలు తీసుకుని వారిని విధుల నుండి తొలగించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఇండియా జనశక్తి పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి శ్రీనివాస్ ఫిర్యాదును చేశారు.

ఈ సందర్బముగా ఇండియా జనశక్తి పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను తమ పాటల ద్వారా తెలియజెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాకారులు వి కన్వెన్షన్, కరీంనగర్లో జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాకారులు పాల్గొని పాటలు పాడడం జరిగిందని, ఈ సమావేశములో పాల్గొన్న ప్రభుత్వ కళాకారుల మీద చర్యలు తీసుకుని వారిని వెంటనె విధుల నుండి తొలగించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
