పీర్జాదిగూడ:విష్ణుపురి, శ్రీపాద ఎంక్లేవ్ కాలనీలలో భయంకర పరిస్థితులు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బైరెడ్డి మధ్యాహ్నం రెడ్డి
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు
  • 18 మందిని రిమాండ్ చేసి చర్లపల్లి జైలుకు తరలింపు..

పీర్జాదిగూడ, జూన్ 1 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ నగర సంస్థ పరిధిలోని 16వ డివిజన్ విష్ణుపురి ఎంక్లేవ్, శ్రీ పాద ఇంక్లేవ్ కాలనీ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఈనెల 30వ తేదీన విష్ణుపురి, శ్రీపాద ఎంక్లేవ్ కాలనీకి మధ్యాహ్నం సమయంలో సుమారు 200 మంది మారణాయుధాలతో( కర్రలు, సుత్తెలు, రాడ్లు) కాలనీలలోకి ప్రవేశించి పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కాలనీవాసులను భయోందనలకు గురి చేశారు. వివరాలల్లోకెలితే పై కాలనీలలో ఎప్పటి నుండో ప్లాట్ల పంచాయతీ కొనసాగుతుంది. దానిలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం సమయంలో పలు వాహనాలలో కాలనీకి చెందిన విజయ్ కుమార్ గౌడ్, గంధమల్ల యాదగిరి, నరసింహ, ప్రవీణ్ అతని అనుచరులు, పలువురు మహిళలు వచ్చి ఇండ్ల నిర్మాణాలను కూల్చివేశారు.

అంతేకాకుండా కాలనీలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. విష్ణుపురి కాలనీ నివాసి అయిన బైరెడ్డి మధ్యాహ్నం రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వృత్తిరీత్యా డ్రైవర్ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం రెడ్డి భార్య శశికళ కొత్తగా వచ్చిన వ్యక్తులను ఫోటోలు, వీడియోలు తీస్తుండగా గమనించిన పలువురు ఆమె దగ్గరికి వెళ్లి ఫోన్ లాక్కొని మెడ పట్టి దాడి చేశారు. ఆమె కూతురు అడ్డుకోవడానికి వస్తే ఆ అమ్మాయి పైన కూడా అసభ్యకరంగా దాడి చేస్తూ ప్రైవేటు పార్ట్స్ లో దాడి చేశారు. అసభ్యకరంగా తిట్టారు, కొట్టారు.

మహిళ అని చూడకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇది చూసి పక్కింటి వారు లక్ష్మి, కావ్య, భావన వచ్చి ఇదేమిటని ప్రశ్నించగా వారిపై కూడా దాడి చేశారు. వెంటనే బైరెడ్డి మధ్యాహ్నం రెడ్డి 100 కు డయల్ చేయగా పోలీసులు కాలనీకి చేరుకొని వారిని చెదరగొట్టారు. కాలనీ వాసుల సూచన మేరకు మధ్యాహ్నం రెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మేడిపల్లి పోలీసులు ఏ 1 గా విజయ్ కుమార్ గౌడ్, ఏ 2 గంధ మల్ల యాదగిరి, ఏ 3 నరసింహ, ఏ 4 ప్రవీణ్ అతని అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం 18 మందిని (14 మంది పురుషులు, 4 మహిళలు) అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఏ 1 విజయ్ కుమార్ గౌడ్ పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *