Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు ఆగదు:దాసోజు శ్రవణ్

కేసీఆర్ కంఠంలో ప్రాణం
ఉన్నంత వరకు రైతుబంధు
ఆగదు:దాసోజు శ్రవణ్

  • కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు ఆగదు. కేసీఆర్ స్వదస్తూరితో రైతుబంధు భరోసా పత్రాన్ని విడుదల చేసిన బిఆర్ఎస్ సీనియర్ నేత డా.దాసోజు శ్రవణ్

హైదరాబాద్, నవంబర్ 28 (విశ్వం న్యూస్): దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతురుణమాఫీ, రైతు భీమా, గిట్టుబాటు ధరలు, పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, కల్తీ లేని విత్తలు, రైతు వేదికలు.. ఇలా అద్భుతమై రీతిలో రైతులకు అండగా ఉంటూ వారి జీవితంలో వెలుగులని నింపి వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఏకైక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

*రైతు జీవితాలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని రాబందు రెడ్డిగా మారిన రెటెంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బిజేపీతో కుమ్మకై ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెచ్చి సజావుగా అమలవుతున్న రైతు బంధుని నిలిపివేసి రైతునోటి దగ్గర ముద్దని లాక్కుకొని పోయిన దుర్మర్గామైన కుట్ర చేసిండు.

*కాంగ్రెస్ పార్టీ మొత్తానికే రైతుల పాలిట శాపంగా మారినట్లుకనిపిస్తోంది. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ని కాదని 3 గంటలు కరెంట్ చాలని రైతుల జీవితాలని, వ్యవసాయాన్ని మళ్ళీ అయోమయంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్

*రైతుబంధు సాయాన్ని నిలిపివేసే కుట్ర చేసిన కాంగ్రెస్ మొత్తానికే రైతుబంధు పధకానికి ఎసరుపెట్టె కుట్ర చేస్తోంది. ప్రతి ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ మానిఫెస్టోలో వుంది. భూయజమానికి ఇస్తామని చెబుతున్నారు.. కౌలు రైతుకు కూడా ఇస్తామని చెబుతున్నారు.. అలా ఎలా ఇస్తారు అంటే ? ఒకసారి ఇస్తామని,ఇంకోసారి ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఇవ్వమని అంటున్నారు. చాట్లో తవుడు పోసి కుక్కలకి పంచాయితీ పెట్టినట్లు .. ఇవాళ భూయజమానులకు, కౌలు రైతులకు పంచాయితీ పెట్టి తద్వారా కొట్లాడుతున్నారు కాబట్టి పూర్తిగా రైతుబంధునే బంద్ నే చేయాలనే కుట్రతో ఫ్యూడల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు

*కేసీఆర్ గారు రైతు బాంధవుడు. ప్రస్తుతం రైతుల్లో నెలకొన్న అభద్రతని తొలగించాలని రైతుబంధు భోరోసా పత్రాన్ని విడుదల చేశారు. కేసీఆర్ మాటగా చెబుతున్నా.. ‘కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు ఆగదు’

*రైతుబంధు పధకాన్ని ఆపాలని కుట్ర చేస్తున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి కర్రుకాల్చివాత పెట్టాలి

”దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతురుణమాఫీ, రైతు భీమా, గిట్టుబాటు ధరలు, పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, కల్తీ లేని విత్తలు, రైతు వేదికలు.. ఇలా అద్భుతమై రీతిలో రైతులకు అండగా ఉంటూ వారి జీవితంలో వెలుగులని నింపి వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఏకైక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు జీవితాలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని రాబందు రెడ్డిగా మారిన రెటెంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బిజేపీతో కుమ్మకై ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెచ్చి సజావుగా అమలవుతున్న రైతు బంధుని నిలిపివేసి రైతునోటి దగ్గర ముద్దని లాక్కుకొని పోయిన దుర్మర్గామైన కుట్ర చేసిండు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసిన ‘కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు ఆగదు’ అని స్పష్టం చేశారు బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్.

ఈ మేరకు మీడియా సమవేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మొత్తానికే రైతుల పాలిట శాపంగా మారినట్లుకనిపిస్తోంది. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ని కాదని 3 గంటలు కరెంట్ చాలని రైతుల జీవితాలని, వ్యవసాయాన్ని మళ్ళీ అయోమయంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్” అన్నారు

‘మరోవైపు రైతుబంధు సాయాన్ని నిలిపివేసే కుట్ర చేసిన కాంగ్రెస్ మొత్తానికే రైతుబంధు పధకానికి ఎసరుపెట్టె కుట్ర చేస్తోంది. ప్రతి ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ మానిఫెస్టోలో వుంది. భూయజమానికి ఇస్తామని చెబుతున్నారు కౌలు రైతుకు కూడా ఇస్తామని చెబుతున్నారు.. అలా ఎలా ఇస్తారు అంటే ? ఒకసారి ఇస్తామని చెబుతున్నారు.. ఇంకోసారి ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఇవ్వమని చెబుతున్నారు. చాట్లో తవుడు పోసి కుక్కలకి పంచాయితీ పెట్టినట్లు .. ఇవాళ భూయజమానులకు, కౌలు రైతులకు పంచాయితీ పెట్టి తద్వారా కొట్లాడుతున్నారు కాబట్టి పూర్తిగా రైతుబంధునే బంద్ నే చేయాలనే కుట్రతో ఫ్యూడల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు” అని పేర్కొన్నారు.

”ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయం వలన, కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం వలన రైతులు భయందోళన కు గురౌతున్న పరిస్థితి నెలకొంది. కేసీఆర్ గారిది రైతులది పేగు బంధం. ఆయన స్వతహాగా రైతు. రైతుబంధు, రైతురుణమాఫీ,, రైతు భీమా, గిట్టుబాటు ధరలు, పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, కల్తీ లేని విత్తలు, రైతు వేదికలు ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో రైతుల జీవితాల్లో వెలుగు నింపారు కేసీఆర్. ఓ మూడు రోజులు రైతుబంధుని నిలిపివేస్తే రైతులకు కేసీఆర్ పై కోపం వస్తుంది తద్వారా తాము లబ్ది పొందవచ్చనే ఓ చిల్లర ఆలోచన చేసిండు రాబందు రెడ్డి. అయితే కేసీఆర్ గారు రైతు భాంధవుడు. ప్రస్తుతం రైతుల్లో నెలకొన్న అభద్రతని తొలగించాలని రైతుబంధు భోరోసా పత్రాన్ని విడుదల చేశారు. కేసీఆర్ మాటగా చెబుతున్నా.. ‘కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు ఆగదు’ అని కేసీఆర్ గారు స్వదస్తూరితో సంతకం పెట్టి రైతుబంధు భరోసా పత్రం నా ద్వారా రైతులకు చేర్చమని ఆదేశం ఇచ్చారు” అని పేర్కొన్నారు దాసోజు.

‘కేసీఆర్ గారి కంఠంలో ప్రాణం ఉన్నంత రైతుబంధు ఆగదు. 24 గంటల ఉచిత కరెంట్ ఆగదు. రైతురుణమాఫీ, రైతు భీమా, గిట్టుబాటు ధరలు, పుష్కలంగా సాగునీరు, కల్తీ లేని విత్తలు, రైతు వేదికలు ఇలాంటి అద్భుతమైన పధకాలతో వ్యవసాయాన్ని మరింత పండగగా మార్చడానికి కేసీఆర్ గారు సిద్ధంగా వున్నారు. కేసీఆర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలి. రైతుబంధు పధకాన్ని ఆపాలని కుట్ర చేస్తున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి కర్రుకాల్చివాత పెట్టాలి” అని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *